Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2024, 8:10 pm Posted by : ramakrishna

జిల్లా స్థాయి బీసీ గురుకుల క్రీడా పోటీలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కంజరలోని మహాత్మ జ్యోతిబా పూలే వెనుక  బడిన తరగతుల సంక్షేమ పాఠశాలలో అండర్ 14, 19 ఆటల పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయని ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలలోని వివిధ బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని అన్నారు. ఈ పోటీల్లో వివిధ  బీసీ గురుకుల పాఠశాలల పీఈటీలు, విద్యార్థులు, పీడీలు పాల్గొన్నారు.