ఎల్లారెడ్డి కేజీబీవీ ని తనిఖీ చేసిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగ రాణి ఎల్లారెడ్డి కేజీబీవీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి కస్తూర్బా గాంధీ స్కూల్ ఎల్లారెడ్డి నందు ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడ ఉన్న పిల్లల యొక్క వంటగదిని, స్నానపు గదులు, నిద్రించే చోట్లు తనిఖీ చేసి అందుకు ఆమె అసంతృప్తి చెందారు. పిల్లల యొక్క ఇతర అవసరాలు తెలుసుకుని తద్వారా వారికి చట్టాలపై అవగాహన...