Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 December 2025, 8:08 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి కేజీబీవీ ని తనిఖీ చేసిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగ రాణి ఎల్లారెడ్డి కేజీబీవీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి కస్తూర్బా గాంధీ స్కూల్ ఎల్లారెడ్డి నందు ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడ ఉన్న పిల్లల యొక్క వంటగదిని, స్నానపు గదులు, నిద్రించే చోట్లు తనిఖీ చేసి అందుకు ఆమె అసంతృప్తి చెందారు. పిల్లల యొక్క ఇతర అవసరాలు తెలుసుకుని తద్వారా వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తూ పోక్స్ చట్టం, బాలల హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, బాల్యవివాహాలు మొదలగు చట్టాల గురించి అవగాహన కల్పించారు ఇట్టి కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల అధికార న్యాయ సంస్థ అధికారిణి ఎం సుష్మ హాజరుకాగా తదితరులు ఉన్నారు.