నగరంలో జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారుల తనిఖీలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలో జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారుల తనిఖీలు పలు దుకాణాలలో ఆకస్మాత్తుగా గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని గంగస్థాన్ ఫేస్-1 ప్రాంతంలో శ్రీరామ గార్డెన్ ఎదురుగా ఉన్న ఎస్ఎంఎన్ఆర్ వైన్స్ పర్మిట్ రూంలో నిబంధనలకు విరుద్ధంగా లేబుల్ లేకుండా, ఎమ్‌.ఆర్‌.పీ రేట్లు లేకుండా వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారులు దాడి చేశారు. తనిఖీ సందర్భంగా సంబంధిత దుకాణంలో వాటర్ బాటిళ్లపై చట్టప్రకారం ఉండవలసిన మాన్యుఫ్యాక్చరర్ వివరాలు, ప్యాకింగ్...