నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మీ రామకృష్ణ దంపతులు కుటుంబ సమేతంగా సోమవారం శ్రీనీలకంటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి సుహాన్ లింఘాభిషేకం చేశారు. అనంతరం పూజారులు సుహాన్, మఖరంధ్ జిల్లాజడ్జి దంపతులకు పూజ వస్త్రాలను ప్రదానం చేసి ఆలయ చరిత్రను వివరించారు. పద్నాలుగేళ్ల పురాతన చరిత్ర కలిగినదని, ఆరవ ఆంధ్ర మహాసభ ఆలయంలోనే జరిగిందని తెలిపారు.