కాకతీయ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆకస్మిక తనిఖీ 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి  తిరుమలపూడి రవికుమార్ గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్, కార్యాలయ సిబ్బంది తో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కార్యాలయ రిజిస్టర్లన్నీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలు దొర్లిన విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావితం చూపిస్తాయని, జాగ్రత్తగా ప్రతి అంశాన్ని క్రోడీకరించాలని అన్నారు....