ఏర్గట్ల ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా తనిఖీ బృందం

  ఏర్గట్ల, బతుకమ్మ :   పీఎం శ్రీ ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం జిల్లా తనిఖీ బృందం సందర్శించి పాఠశాలలోని విద్యా, మౌలిక వసతులు, విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల బోధనా విధానాలను సమగ్రంగా పరిశీలించింది. తనిఖీలో భాగంగా అధికారులు తరగతి గదులను సందర్శించి విద్యార్థుల ప్రతిభ, వారి ప్రదర్శన, ఉపాధ్యాయుల బోధనా పనితీరును పరిశీలించారు. అలాగే పాఠ్యప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు, టీచర్ డైరీలను తనిఖీ చేశారు. పాఠశాలలోని గ్రంథాలయ నిర్వహణ, సైన్స్ ల్యాబ్, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలను...