Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2025, 12:19 pm Posted by : ramakrishna

జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలి

 నిజామాబాద్, బతుకమ్మ :  నగరం లోని మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర బుధవారం  బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ  మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు తీసుకురాని జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే లు,  ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  ఇందూరు జిల్లా కు ముఖ ద్వారంగా ఉండాల్సిన రైల్వే పనులు కేంద్రం రూ.  93 కోట్లు విడుదల చేసి పనులు ప్రారంభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 10కోట్లు రూపాయలు విడుదల చేయక పనులు  నిలిచిపోయాయని  విమర్శించారు.  రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి  కల్లు బట్టీలు, ఇటుక బట్టీల వద్ద వసూలు మీద ఉన్న శ్రద్ద అభివృద్ధి మీద  లేదని విమర్శించారు.  జిల్లా కు మంత్రి కానీ మంత్రి సుదర్శన్ రెడ్డికి  ఈ రోడ్ కనపడుతలేదని ప్రశ్నించారు.  జిల్లా  ప్రజల మీద ఎందుకు అంత కోపమని,   రోడ్ మీద నుంచి పోవాలంటే నే  ప్రజలు జంకుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు అభివృద్ధి మీద శ్రద్ద లేదా  అని ప్రశ్నించారు. వెంటనే  కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  అనంంతరం మొరం పోసి దినేష్ కులాచారి గుంతలను పుడ్చారు.

Congress MLAs and MLCs should resign