ఆరోగ్య, విద్యా రంగాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి      

ఆకస్మిక తనిఖీలతో మండల అధికారులలో వణుకు. మాక్లూర్ పీహెచ్‌సీ,  గురుకుల పాఠశాల తనిఖీ   మాక్లూర్, బతుకమ్మ : జిల్లాలో విద్యా, ఆరోగ్య రంగాల అభివృద్ధికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా? ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయా? అన్న విషయాలను పర్యవేక్షించేందుకు ఆయన ఏ సమయంలోనైనా గ్రామాల్లోని ఆసుపత్రులు, హాస్టళ్లు, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తు ఇటు మండల అధికారుల లో జవాబుదారీ తనం వచ్చే విధంగా కృషి చేస్తు అటు ప్రజల్లో ప్రభుత్వ...