బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మూడో విడత ఎన్నికల సామగ్రి పంపిణీ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి తో కలిసి పరిశీలించారు. బాన్సువాడలో 16 గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతున్న అధికారులకు పలు సూచనలు చేశారు. రెండు గంటలకు ఒకసారి ఎన్నికల శాతాన్ని అందించాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.ఎన్నికల సామగ్రి ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పక్కాగా అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా లేదా పరిశీలించుకోవాలని సిబ్బందితో పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తేవాలని, పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లపై క్రాస్‌చెక్ చేసుకోవాలని ఆర్వోలకు సూచించారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు.