జిల్లా కలెక్టర్ సార్ జర ఇదర్ దేఖో
ప్రజలకు అందని సాంప్రదాయ యునాని వైద్యం విధులకు హాజరుకాని వైద్యులు, సిబ్బంది ఐదు పడకల ఆసుపత్రిలో ఓపి సేవలకే పరిమితం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ యునాని ఆసుపత్రి ఉన్న ప్రజలకు సాంప్రదాయం వైధ్యం అందకుండా నిరుపయోగంగా మారింది. ఆధునిక విశాలమైన భవనం నిర్మించిన వైద్యులు, సిబ్బందిని నియమించినప్పటికీ, ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందడం లేదు. ఒక వైద్య అధికారి (సీనియర్ మెడికల్ ఆఫీసర్), ఒక మహిళా డాక్టర్ (డిస్టిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్), ముగ్గురు ఫార్మసిస్టులు, ఇద్దరు...