రుద్రూర్, బతుకమ్మ :
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రుద్రూర్ మండలంలోని రాయకూర్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ సబిల్ కు ఉత్తమ లైన్మెన్ గా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంస పత్రాన్ని అందజేశారు. రాయకూర్ సబ్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు ఆయన ఈ అవార్డు అందుకున్నారు. 2007 లో విద్యుత్ శాఖలో చేరి రాయకూర్ సబ్ స్టేషన్ లో 2017 నుండి 2021 వరకు సేవలందించి బదిలీపై బోధన్ వెళ్లిన ఆయన తిరిగి 2024 నుండి రాయకూర్ సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహలో అంకితభావంతో పనిచేస్తు ఉత్తమ లైన్ మెన్ గా ఎంపికైన మొహమ్మద్ అబ్దుల్ సాబీల్ ను విద్యుత్ శాఖ అధికారులు ఎస్సీ రాజేశ్వర్, డిఈ ముక్తార్, ఏడి నవీన్,ఏఈ శ్రీనివాస్, సబ్ ఇంజనీర్ గిరిధర్,సహా ఉద్యోగాస్తులు శ్రీనివాస్ దేశాయ్, కరీం, ఆనంద్ పలువురు అభినందనలు తెలియజేశారు.