Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2024, 5:16 pm Posted by : ramakrishna

నాగారం లోని డంపింగ్ యార్డ్ ను పరిశీలించినజిల్లా కలెక్టర్,మున్సిపల్ కమిషనర్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నాగారం లోని నగరపాలక సంస్థకు సంబంధించిన ఘనవ్యర్డ పదార్థాల నిర్వహణ ప్లాంట్ శుక్రవారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ సందర్శించి అక్కడ ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ తీరును, బయో మైనింగ్ ప్లాంట్ పనితీరును పరిశీలించారు. నగరం నుండి పెద్ద ఎత్తున వొచ్చే ఘనవ్యర్థ పదార్దాలను అలాగే గుట్టలుగా పేర్చకుండా, వాటిని బయోమైనింగ్ విధానంలో నిర్వహించి, వాటిని తగ్గించాలి అని ఆదేశించారు. ఘనవ్యర్దాలను తగ్గించడం, పునరుత్పత్తి చేయడం, పునర్వినియోగం చేయడానికి చర్యలు తీసుకోవాలి అని తెలియజేసారు. నగరంలోని నివాసులు ఇంటిలోని వ్యర్థాలను తడి మరియు పొడి వ్యర్థాలుగా వేరు చేసి, ఇంటి ముందుకు వొచ్చిన పురపాలక సంస్థ వాహనానికి అందించాలి అని, తద్వారా మునిపల్ వ్యర్థాలనుండి కంపోస్టు మరియు రీసైకిల్ పునర్వియోగం సాధ్యం అవుతుందని, తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్, బయోమైనింగ్ ప్లాంట్ నిర్వాకుడు వేణు తదితరులు పాల్గొన్నారు.

District Collector, Municipal Commissioner inspected the dumping yard in Nagaram