Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 March 2025, 4:17 pm Posted by : ramakrishna

మోడల్ ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను  బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని, లబ్ధిదారులకు ఉన్న ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక ఇతర ముడిసరకు సమకూర్చాలని అధికారులకు తెలిపారు . ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిరుపేదలకు ప్రాధాన్యత కల్పించాలని ఇళ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతించాలని తెలిపారు. భిక్కనూరు మండలంలో 145 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయపాల్ రెడ్డి తాసిల్దార్ శివప్రసాద్ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి సౌజన్య గ్రామస్తులు పాల్గొన్నారు.

District Collector inspects model Indiramma houses