Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 4:59 pm Posted by : ramakrishna

దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలో దెబ్బతిన్న రోడ్లను జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. గిద్ద అర్జున వాడకు వెళ్లే రోడ్డు తెగిపోవడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిద్ధ రామేశ్వర టెంపుల్ వెళ్లే దారిలో రోడ్డు తెగి పోవడంతో రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. అధికారులను ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంఆర్ఓ సునీత, ఎంపిడి వో రాజ్ కిరణ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామ సచివాల ఈవో మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.