తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల తరగతి గదుల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలను గతంలో తనిఖీ చేయగా విద్యార్థులకు తరగతి గదులు ఇబ్బందిగా ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ రెండు తరగతి గదుల నిర్మాణాలను చేయాలని ఆదేశించారు.వాటి నిర్మాణంతో పాటు విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కోసం వేసిన బోరు మోటారును పరిశీలించారు. పూర్తిస్థాయిలో తరగతి గదుల నిర్మాణం అయిపోవాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట మండల...