బిచ్కుంద మండలంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటన
బతుకమ్మ:బిచ్కుంద : ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలం ఫత్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఇళ్లు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల నిర్మాణానికి అనువైన భూమి ఉందో లేదో తెలుసుకోవాలనీ అన్నారు. సర్వే కు ఒకరోజు ముందు గ్రామంలో టామ్ టామ్ చేయాలని తెలిపారు. సర్వే సమయంలో ఇందిరమ్మ కమిటీ...