రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) సహకారంతో శనివారం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ, "గత సంవత్సరం కామారెడ్డి జిల్లా రక్తదాన రంగంలో రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఈ ఏడాది కూడా పేద మరియు అవసరమైన వారికి అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో మరింత బలోపేతంగా...