Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2025, 3:25 pm Posted by : ramakrishna

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) సహకారంతో శనివారం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ, “గత సంవత్సరం కామారెడ్డి జిల్లా రక్తదాన రంగంలో రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఈ ఏడాది కూడా పేద మరియు అవసరమైన వారికి అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో మరింత బలోపేతంగా ఈ కార్యక్రమాలు జరగాలి,” అని తెలిపారు. రక్తదాన శిబిరాన్ని పురస్కరించుకుని, గవర్నర్ అవార్డు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ శాఖల అధికారులను సన్మానించి, మమెంటోలు అందజేశారు. కలెక్టర్ ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎం. రాజన్న ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి నెల రెండు లేదా మూడు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ శాఖలు ముందుకొచ్చి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ విక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దయానంద్, గ్రౌండ్ వాటర్ శాఖ సతీష్ యాదవ్,బీసీ వెల్ఫేర్ అధికారి షకీల్, చక్రధర్, డీఎస్సీ ఓ. వెంకటేష్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) జిల్లా చైర్మన్ ఎం. రాజన్న,కార్యదర్శి బి. రఘు కుమార్,కరస్పాండెంట్ డాక్టర్ పీ వి నరసింహం,డిసీఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

District Collector Ashish Sangwan inaugurated the blood donation camp