Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 8:34 pm Posted by : ramakrishna

మహిళలు, చిన్నారులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

 

. . . సత్వర వైద్య, న్యాయ, మానసిక సహాయ సేవలు ఒకే వేదికపై అందేలా సమన్వయంతో పనిచేయాలి

 

. . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాసం కల్పించడంలో భరోసా కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా కామారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ బాదితులకు అందుతున్న సేవలు, నమోదైన కేసుల పురోగతి, వివిద శాఖల మధ్య సమన్వయం, పునరావాస చర్యలు, కౌన్సిలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు తదితర అంశాలపై భరోసా కోఆర్డినేటర్, దరేసా కేంద్ర సిబ్బంది తో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐరోపా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితురాలికి ఒకే వేదికపై వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించడం మనందరి బాధ్యతని, వైద్య, న్యాయ, పోలీసు మహిళా, శిశు సంక్షేమ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితురాలితో సిబ్బంది అత్యంత సానుభూతితో, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి. వైద్య సేవలు, మానసిక కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం, పోలీసు సహాయం, పునరావాస సేవలు ఎలాంటి ఆలస్యం లేకుండా సమన్వయంతో అందించాలన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా, నాణ్యంతో పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కేసులో బాధితుల వ్యక్తిగత వివరాల గోప్యతను అత్యంత ప్రాధాన్యతగా భావించి కచ్చితంగా పరిరక్షించాలన్నారు. బాధితుల్లో విశ్వాసాన్ని పెంపొందించే విధంగా భరోసా కేంద్రం సేవలు మరింత సమర్థవంతంగా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ భరోసా కేంద్రంలోని కౌన్సెలింగ్ గదులు, లీగల్ సెల్, మెడికల్ ఎయిడ్ విభాగం, రికార్డు నిర్వహణ విధానం, బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం కోఆర్డినేటర్ కవిత, భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

 

District Bharosa Centre stands as a support system for women and children.