Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2024, 5:42 pm Posted by : ramakrishna

అంతర్జాతీయ ఉషూ పోటీల్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అంతర్జాతీయ స్థాయి ఉషూ పోటీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. నిజామాబాద్ నగరానికి చెందిన సాయి దీక్షిత్, మల్లారం ఆకాంక్ష, ఫరియా ఖానం ఈ 17 నుంచి 22 వరకు యూరప్ లోని జార్జియాలో నిర్వహించిన పోటీల్లో పతకాలు సాధించినట్లు ఉషూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఉమర్ తెలిపారు. క్రీడాకారులను వివిధ క్రీడా సంఘాల సభ్యులతో పాటు నగర వాసులు అభినందించారు.