Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2025, 5:42 pm Posted by : ramakrishna

కలెక్టర్ ను కలిసిన జిల్లా వ్యవసాయాధికారి

కామారెడ్డి, బతుకమ్మ : వికారాబాద్ జిల్లా నుండి బధిలీపై  జిల్లా వ్యవసాయాధికారి గా నియామకమైన యన్. మోహన్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తో కలిసి  సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి  పూల మొక్క అందజేసి జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వర్షాకాలం ప్రారంభమైనందున రైతులకు, వ్యవసాయ శాఖకు ఈ సీజన్ చాలా ముఖ్యమైనదని అప్రమత్తంగా ఉండి వానకాలం పంట సమయంలో  రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎరువులు, విత్తనాల సరఫరా, నకిలీ విత్తనాలు,  మందులను అరికట్టడం మరియు రైతులను చైతన్య పరచడం తదితర విధులను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నూతన జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. ఇప్పటివరకు జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేసిన తిరుమల ప్రసాద్ నిజామాబాద్ ఆత్మ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.