Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 5:26 pm Posted by : ramakrishna

హరీష్ కు జిల్లా 4వ ర్యాంక్

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం శేట్ పల్లీ గ్రామానికి చెందిన పెగడ హరీష్ సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (పీ ఈ టీ)జిల్లాలో 4వ ర్యాంకు సాధించారు. హరీష్ 11 సంవత్సరాలుగా ఏఆర్ కానిస్టేబుల్ గా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. డీఎస్సీ 2024 అద్భుత ప్రతిభ కనబరిచి 4వ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.