అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వితరణ
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు వితరణ చేశారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఫౌండేషన్ సభ్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఫౌండేషన్ సభ్యులు సంపత్, శ్రీధర్, రాజు, శ్రీకాంత్, చంద్ర శేఖర్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.