ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గోడ గడియారాల పంపిణీ

  జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు శుక్రవారం గోడ గడియారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పథకం అమలులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పేదలకు గౌరవప్రదమైన గృహాలను అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. గృహ నిర్మాణంతో పాటు లబ్ధిదారులకు అవసరమైన ప్రోత్సాహక కార్యక్రమాలను కూడా చేపడుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే...