Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 5:15 pm Posted by : ramakrishna

పేద పిల్లలకు ఆట వస్తువులు పంపిణీ

బతుకమ్మ, ఆర్మూర్: అనాథలు కనిపిస్తే ఆదరిస్తారు. పేదవారు కనపడితే ప్రేమ చూపిస్తారు. దయనీయ స్థితిలో ఉన్న వ్యక్తులపై దయ చూపించి తత్వం ఆ ట్రస్ట్ సభ్యులది. కష్టాల్లో ఉన్న వారిపై కరుణ చూపించి  ఆదరించే మనసున్న గుణం కరుణా ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థదని తెలుపడంలో అతిశయోక్తి లేదు. ట్రస్ట్ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఆర్మూర్ ప్రాంతంలోని పేద పిల్లలకు ఆట వస్తువులను పంపిణీ చేయడం జరిగిందని కరుణ ట్రస్ట్ చైర్మన్ మహేష్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని  ఆయన అన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్న అనాధల కోసం, వృద్ధుల కోసం, అభాగ్యుల కోసం భవిష్యత్తులో శేట్ పల్లీ కేంద్రంగా అనాధాశ్రమం, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి కరుణా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి మౌనమి,ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Distribution of toys to poor children