Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 April 2025, 4:36 pm Posted by : ramakrishna

సన్న బియ్యం పంపిణీ

ఆర్మూర్, బతుకమ్మ : రాష్ట్రప్రజాపాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని మంగళవారం మండలంలోని చేపూర్, పల్లె రెండు గ్రామాలలో ఆర్మూర్ నియోజక వర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు సురకంటి చిన్నారెడ్డి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచెల చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వారు అన్నారు.ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని ఉచితంగా పొందేల చర్యలు తీసుకుందని ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని అందరి సహకారంతో సజావుగా విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేపూర్ పల్లె గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రామ్ సన్, మాజీ ఎంపీటీసీ జన్నేపల్లి గంగాధర్, ఉపాధ్యక్షులు ధర్మయ్య, చిట్యాల పోశెట్టి, విడిసి అధ్యక్షుడు  ఎస్ రవి, ఆది సంతోష్, అరె రాజు, సాయ గౌడ్, దేవరాజ్, కొంపెల్లి సుధాకర్  లింబద్రిగౌడ్,  కటికే లక్ష్మణ్ సోక్కం సంజీవ్, అజీమ్, మురళి తదితరులు పాల్గొన్నారు.