మోడల్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామ శివారులో గల మోడల్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్ చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు బడి రాము, వార్డ్ మెంబర్లు రామసాని సాయిలు, సుంచు జోష్నా, పవన్, పాఠశాల చైర్మన్ పావని, నరేష్, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.