Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 12:00 pm Posted by : ramakrishna

మల్లాయిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పాఠ్యపుస్తకాల పంపిణీ 

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ:

ఎల్లారెడ్డి  మండలం మల్లాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను నోటు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. బుధవారం పాఠశాల ఆవరణలో మల్లాయిపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మీ మైసయ్య , ఉప సర్పంచ్ పైతర రాజు, ఏ ఏ పీ సి చైర్మన్ పావని , గ్రామ పంచాయతీ సెక్రటరీ వనజ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వనాథం , సహాధ్యాయులు సంతోష్ చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు మంచిగా చదివి ప్రయోజకులు కావాలని కోరారు. మంచి విద్య ద్వారా సమాజానికి, వ్యక్తిగతంగానే ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత విద్య ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Distribution of textbooks at Mallayipalli Government Primary School