Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 4:42 pm Posted by : ramakrishna

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రలోని కస్తూర్బా గాంధీ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, అంబం మోడల్ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సహకారంతో బుధవారం పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తల్లి దండ్రులకు, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు. ఈ  కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరు ప్రశాంత్ గౌడ్, నాయకులు కటికే రామ్ రాజ్,  కుల్లెర మోహన్ రావు, వెంకటేష్, బోజిగొండ అనిల్, కుమ్మరి గణేష్, వడ్ల సాయినాథ్, అంబం గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Distribution of test papers and pens to class 10 students