బతుకమ్మ,ముప్కల్ : నాయకుడు సంతోష్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో సోమవారం ముప్కాల్ మండల కేంద్రంలో సన్నకారు రైతులకు తాటిపత్రులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ‘నాయకుడు సంతోష్ ఫౌండేషన్’ ఛైర్మన్ నాయకుడు సంతోష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో రైతులకు అండగా ఉంటూ పూర్తి సహకారాన్ని అందిస్తానని అన్నారు. పంపిణీ అనంతరం రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ తల్లిదండ్రులు నాయకుడు పద్మ-కిషన్, గ్రామపరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ థామస్, గద్దల గంగారాం, కట్ట మహేష్, కల్లు స్వామి, దాసరి నర్సింగ్ దాస్, బొట్ల చిన్న రాజన్న, కట్ట గోపి, నేర బాబు రావ్ తదితరులు పాల్గొన్నారు.