Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 8:21 am Posted by : ramakrishna

రెండో విడతలో గెలుపు కోసం తాయిలాల పంపిణీ

 

. . . ఓటుకు 2 వేల వరకు పంపిణీ

. . . మహిళలకు చీరల పంపిణీ

. . . మద్యం  పట్టుకున్న కేసులు చేయకుండా ఓత్తిడి

 నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు లక్ష్యంగా తాయిలాల పంపిణీకి తెరలేపాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరిగాయి. శనివారం రాత్రి నిజామాబాద్ డివిజన్ లోని 7 మండలాలు, ఆర్మూర్ డివిజన్ లోని జక్రాన్ పల్లి మండలం లో ప్రలోభాల పర్వం జోరుగా సాగింది. మహిళలకు ఇంటింటికి చీరల పంపిణీ జరిగింది. కొందరు గెలుపుకోసం నిజామాబాద్ జిల్లాలో 158 పంచాయతీలకు జరుగుతున్న ఓట్ల కోసం నోట్లు మంచినీళ్ల ప్రాయం లా ఖర్చు చేశారు. ప్రధానంగా అధికార పార్టీ అభ్యర్థులు డబ్బు పంపిణీ బహిరంగంగా చెపట్టారు. నామినేషన్ల దాఖలు మొదలుకొని ఉపసంహరణ వరకు బుజ్జగింపులు తర్వాత దావత్ లకు పరిమితమైన లీడర్ గెలుపు అంచనాలు అందుకోవడానికి నోట్ల పంపిణీ కి దిగారు. రాత్రి వేళ ప్రారంభమైన ఓట్ల పంపిణీ ఆదివారం ఉదయం కూడా సాగింది. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కూడా పలు ప్రాంతాల్లో దీటుగా పంపిణీ చేయడం గమనార్హం. మరో ప్రతి పక్ష పార్టి ఓటు బ్యాంక్ ను నమ్ముకోగా రెండు పార్టీలు మాత్రం రాత్రి క్వార్టర్ మద్యం, నోటు పంపిణిలను చేశారు. గ్రామ పంచాయతీలో పట్టు నిలుపుకోవడం కోసం ఓట్లు రాబట్టాలని పంపిణీ జరిగింది. ప్రధానంగా విడిసి మాటలను బేఖాతరు చేసి పోటీకి దిగిన చోట  స్వయంగా గ్రామ పెద్దలను మచ్చిక చేసుకునే వారు పంపిణీ బాధ్యతలు చేపట్టారు. గెలుపుకోసం కుల ప్రాతిపదికన ఓట్లు చీలిక తెచ్చిపెట్టారు. దానికి తోడు కొందరు బరిలో ఉన్న వారిని సైలెంట్ ఉండాలనే దోరణిలో బుజ్జగింపులు, ప్రలోభాలకు గురి చేశారు. అవసరమైన చోట సహయ నిరాకరణ అంటూ బెదిరింపులకు దిగారు. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ నేత తన అనుచరుల ద్వారా నోట్ల పంపిణీ దగ్గర ఉండి చేయించడం విశేషం. మండల, పార్టీ, ప్రజాప్రతినిధులు నోట్ల పంపిణీ బాధ్యత నెత్తిన పెట్టుకున్నారు. ప్రధానంగా ప్రత్యర్ధులు బలంగా ఉన్నచోట పోల్ మెనేజ్ మెంట్ వ్యూహ రచన చేశారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో ఒ పార్టీకి చెందిన మద్యం పట్టుబడిన కేసులు చేయవద్ధని ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. మొత్తానికి ఆదివారం జరిగే పోలింగ్, కౌంటింగ్, గెలుపు లక్ష్యంగా తాయిలాల పంపిణీ జోరుగా సాగింది. ఒటుకు రెండు వేల పంపిణితో పంచాయతీ ఎన్నికలు సాధరణ ఎన్నికలను మరిపించాయి.

Distribution of tails for victory in the second phase