Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2024, 6:19 pm Posted by : ramakrishna

జిల్లా వైద్యాధికారిని చేతుల మీదుగా స్ప్రే మిషన్ల పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ చేతుల మీదుగా పవర్ స్ప్రే మిషన్స్ ను జిల్లా కేంద్రంలోని పిఓడిటిటి వద్ద శుక్రవారం 11 మంది సబ్ యూనిట్ అధికారులకు అందించారు. ఈ స్ప్రే మిషన్లు సుమారు ఒకొక్కటి నాలుగు వేల రూపాయల విలువ చేసేవి అని అన్నారు. జిల్లాలోని సబ్ యూనిట్ అధికారులందరూ కేసు వచ్చిన ఇంటి చుట్టు పరిసరాల్లో యాంటీ లార్వల్ స్ప్రే ను, మరియు ఇంటిలో ఇండోర్ స్ప్రేను, ఫ్రైడే డ్రై డేను వారానికి రెండుసార్లు విస్తృతంగా నిర్వహించి జిల్లాలో కీటక జనత వ్యాధులను ముఖ్యంగా డెంగ్యూ నియంత్రించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కీటక జనత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, నిజామాబాద్ డివిజన్ ఉపజిల్లా వైద్యాధికారిని డాక్టర్ అంజన మేడం, ఏ ఎం ఓ సలీం, ఎం శంకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Distribution of spray machines by the hands of District Medical Officer