Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 July 2025, 6:57 pm Posted by : ramakrishna

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాలెం గ్రామానికి చెందిన ఎనుగందుల సాయినాథ్ పాఠశాల విద్యార్థులకు సుమారు రూ. 30000 విలువగల 65 జతలు స్పోర్ట్స్ డ్రెస్సెస్ అందించడం  జరిగింది. సందర్భంగా పాఠశాల కేజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలరావు మాట్లాడుతూ సాయినాథ్ తండ్రి అశోక్ గతంలో ఎంపీటీసీగా పాఠశాలకు సేవలు అందించారనీ ప్రస్తుతం సాయినాథ్ అమెరికాలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారని తెలిపారు. చిన్న వయసులోని ఇంతటి సమాజసేవ దృక్పథం ఉన్న సాయినాథ్ ను పాఠశాల  ఉపాధ్యాయ బృందం అభినందించారు. సాయినాథ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదివి తమ పాఠశాలకు గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల బృందం ఎస్ మహేష్ కుమార్, నరసింహస్వామి, రాజేందర్, త్రివేణి, మమత, రాజేశ్వరి, సైఫ్ అలీ,, నచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Distribution of sportswear to students