విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

బతుకమ్మ, ఏర్గట్ల:  ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ దేవేందర్ సంయుక్తంగా క్రీడా దుస్తులను గురువారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శివన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం తన వంతుగా బాధ్యత తీసుకొని సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.  స్కూల్ విద్యార్థులు చక్కగా చదువుకొని పాఠశాలకు, స్కూల్ ఉపాధ్యాయులకు, మంచి పేరు తేవాలని, ఏర్గట్ల పాఠశాల పేరును జిల్లా వ్యాప్తంగా గుర్తింపు తేవాలని విద్యార్థులతో అన్నారు. కోపరేటివ్...