Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2024, 5:35 pm Posted by : ramakrishna

మట్టి గణపతుల పంపిణీ 

బతుకమ్మ, ఆర్మూర్ : నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన సమాజ సేవకులు శ్రీమాన్ కొట్టురుఅశోక్ 23 వేల, మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నారు. గత ఏడాది వినాయక చవితిని పురస్కరించుకుని 26,వేల మట్టి గణపతులను ప్రతి ఇంటిలో పూజించేవారికి అందజేశారు. ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వినాయక చవితిని పురస్కరించుకొని పూజలు నిర్వహించుకోవాలన్నారు. మట్టి గణపతులను ఇంట్లో పెట్టుకుని పూజించేవారు, మట్టి గణపతులను ఇంటిలో గల తులసిలో నిమగ్నం చేయడం ద్వారా శుభం లాభం జరుగుతుందని సమాజ సేవకులు శ్రీమాన్ కొట్టురు అశోక్ తెలిపారు. రసాయనిక ఎరువుల తో తయారుచేసిన గణపతులను ఏర్పాటు చేయడం వల్ల, చెరువులలో గాని, వాగులలో గణపతులను నిమగ్నం చేయడం ద్వారా నీరు కలిసితమవుతుందని, దీంతో ప్రజలు రోగాలకు గురవుతారని ఆయన పేర్కొన్నారు. మట్టి గణపతులతో పూజించేవారు ఈ క్రింది సెల్ నెంబర్ కు 9440038389, కు ఫోన్ చేస్తే పూర్తి సమాచారం అందిస్తామని, అంతేకాకుండా ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి మట్టి గణపతులను అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 25 వరకు మట్టి గణపతులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.