కలెక్టరేట్ లో మట్టి గణపతుల పంపిణీ
బతుకమ్మ, నిజామాబాద్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో శుక్రవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ఉద్యోగులకు మట్టి గణపతులు పంపిణీ చేశారు. వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ద్వారా కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తుండడం గొప్ప విషయమని ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. పర్యావరణ సమతుల్యత...