Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 2:40 pm Posted by : ramakrishna

రైతులకు విత్తనాల పంపిణీ

జక్రాన్ పల్లి, బతుకమ్మ  : జక్రాన్ పల్లి రైతు వేదికలో ” నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం” అనే కార్యక్రమంలో భాగంగా రైతులకు ఆర్డీఆర్ 1200 రకం వరి వంగడాన్ని , పెసలు విత్తనాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా కమిటీ సభ్యులు కోటపాటి నరసింహం నాయుడు పంపిణీ చేశారు. ప్రతి ఊరిలో 3గురు లేదా 5 గురు ఆదర్శ రైతులకు 10 కిలోల చొప్పున అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఎకరాకు 35 క్వింటాళ్ల నాణ్యమైన దిగుబడి సాధించడం దీని ప్రత్యేకత అన్నారు. ఈకార్యక్రమంలో రుద్రూర్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అధిపతి డా” అంజయ్య, మండల వ్యవసాయ అధికారిణి దేవకి, వ్యవసాయ శాస్త్రవేత్త రాకేష్, అర్గుల్ సొసైటీ అధ్యక్షులు గంగారెడ్డి, ఏఈవోలు పాల్గొన్నారు.