Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2025, 6:09 pm Posted by : ramakrishna

స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

బతుకమ్మ, కోటగిరి : కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్సువాడ  నియోజకవర్గం బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తమ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక మంచి సంకల్పంతో సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా కనీస సౌకర్యార్థం వారికి కావలసిన  స్కూల్ బ్యాగ్స్ అందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలోని గల రాంపూర్, ఎక్లాస్ పూర్, ఏ క్లాస్ పూర్ క్యాంప్, కొత్తపల్లి దేవుని గుట్ట తండా, వల్లభాపూర్, యాద్గాపూర్,ఎక్లాస్ పూర్  క్యాంపు గ్రామం లో గుమ్మడి ఫౌండేషన్,మండల కేంద్రంలో హరిజనవాడ లో గల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, నోట్ బుక్, పెన్నులు  పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మార్కెలి   ప్రకాష్ పటేల్, కోటగిరి బిజెపి మండల అధ్యక్షులు ఏమూల నవీన్, కోటగిరి మండల సీనియర్ నాయకులు సాయిలు, మేకలగంగాధర్, మధు, హనుమంతు, కృష్ణ, మామిడి సాయిలు, రోషన్, భూమయ్య, రవి, రామరాజు, రాజా గౌడ్, బీజేపీ కార్యకర్తలు,  బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నాయకులు కార్యకర్తలు స్కూలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Distribution of school bags