Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 6:00 pm Posted by : ramakrishna

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ

బతుకమ్మ, కోటగిరి :  కోటగిరి మండల కేంద్రంలోని వెనుక బడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహంలోని 77 మంది విద్యార్థుల చలి బారిన పడకుండా ఉండడం కోసం ఇండియా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో  రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా  రెడ్ క్రాస్ సోసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ ఏ డి ఈ ఎన్పీడీసీఎల్ మాట్లాడుతూ…. అన్ని ప్రభుత్వమే చేస్తుంది అనకుండా మనం కూడా సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగము పంచుకోవాల్సిన అవసరం ఉంది మరి విద్యార్థులకు కూడా బాగా చదువుకొని మీరు మీ తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా  సహాయ సహకారాలు అందించాలని ఆయన  తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మండల చైర్మన్ వెంకటేశం, స్థానిక ఏఈ కోటగిరి బుజ్జిబాబు, హాస్టల్ వార్డెన్ కల్పలత,స్థానిక విద్యుత్ సిబ్బంది వైద్య తదితరులు పాల్గొన్నారు.

Distribution of rugs under the auspices of the Red Cross