విద్యార్థినిలకు రగ్గులు పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్స్ స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో బుధవారం రాత్రి  నిజామాబాదు నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థినిలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య మాట్లాడుతూ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని హెల్ప్ టు అదర్స్ సంస్థ రగ్గులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. జిల్లాలో హెల్ఫ్ టు అదర్స్, లయన్స్ వంటి స్వచ్చంద సంస్థల ద్వారా  ఇప్పటివరకు 220  రగ్గులు  అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థినిలు...