Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 6:35 pm Posted by : ramakrishna

విద్యార్థినిలకు రగ్గులు పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్స్ స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో బుధవారం రాత్రి  నిజామాబాదు నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థినిలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య మాట్లాడుతూ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని హెల్ప్ టు అదర్స్ సంస్థ రగ్గులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. జిల్లాలో హెల్ఫ్ టు అదర్స్, లయన్స్ వంటి స్వచ్చంద సంస్థల ద్వారా  ఇప్పటివరకు 220  రగ్గులు  అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థినిలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చిన్నప్పటినుంచి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాధారాణి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  జిల్లా చైర్మెన్ బుస్స ఆంజనేయులు,కోశాధికారి కరిపె రవీందర్, హెల్ఫ్ టు‌ అదర్స్ తెలంగాణ కో ఆర్డినేటర్ జిల్కర్ విజయానంద్,జిల్లా కో- ఆర్డినేటర్ చింతల గంగాదాస్, రమణ స్వామి, రెడ్ క్రాస్ పీఆర్వో రామకృష్ణ   పాల్గొన్నారు.