ఆలయ కోడె దూడలకు వరిగడ్డి వితరణ 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల  కేంద్రంలో దక్షిణ కాశి సిద్ధరామేశ్వర  ఆలయంలో ఉన్న కోడెదూడలకు ఆహారంగా వరిగడ్డిని బత్తుల రాజు ఆదివారం వితరణ చేశారు. ఆలయంలో ఉన్న కోడెదూడలకు రైతులు వరిగడ్డిని కాల్చకుండా ఆలయంలోని కోడెదూడలకు  వితరణ చేయాలని పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీధర్ సిబ్బంది ఉన్నారు.