Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 1:43 pm Posted by : ramakrishna

ఉపాధి హామీ కూలీలకు  ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

 

 సిరికొండ, బతుకమ్మ:

న్యావనంది హెల్త్ సెంటర్ ఏఎన్ఎం అరుణ కుమారి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ గురించి వివరించారు. శనివారం న్యావనంది లో జరుగుతున్న ఉపాధి హమీ పనులు ప్రాంతంలో 105 ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూలీలకు అందించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం అరుణ మాట్లాడుతూ… ఎండాకాలం నీరు తక్కువ తాగడం వల్ల శరీరంలో కలిగే అనారోగ్య సమస్యలు వివరించి శరీరంలో  వేడి పెరిగి  వచ్చే అనారోగ్య సమస్యలు  తెలిపారు. వేసవి కాలంలో వడదెబ్బ కు గురి కాకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు కూలీలకు వివరించారు, ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల వరకు నీరు తాగాలని ,  శరీరంపై కాటన్ దుస్తులు ధరించాలని శరీరానికి అంటుకొని ఉండే విధంగా దుస్తులు ధరించరాదు అని వివరించారు. వేసవి కాలంలో ఉపశమనం కోసం నిమ్మరసం, మజ్జిగ తాగడం వల్ల శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని తెలియ చేశారు . ఈ కార్యక్రమంలో నాయకులు మామిడి కింది మహిపాల్, ఆశ వర్కర్లు లక్ష్మి, గోదావరి , రఘు, రక్షిత, రాజుల గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్ పాల్గొన్నారు.

Distribution of ORS packets to employment guarantee workers