విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని భాగర్తి పల్లి గ్రామంలోని ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు శ్రీరామ్ వెంకటేష్ నోట్స్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని నేడు ప్రతి పోటీ పరీక్షలో సత్తా చూపిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగయ్య గారి నరసింహులు గ్రామ యూత్ అధ్యక్షుడు వడ్లస్వామి మండల నాయకులు నాగర్తి రామ్...