లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో జిపిఎస్ గుర్బాబాది స్కూల్‌లో నోట్బుక్స్, పెన్నులు, న్యూట్రిషన్ జ్యూస్ బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ హాజరై మాట్లాడుతూ, జీరో స్కూల్‌ను పునర్జీవనం తీసుకురావడంలో పాఠశాల హెడ్‌మాస్టర్ చిన్నయ్య స్వామి, వాణి టీచర్‌లను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అందుకే నోట్బుక్స్, పెన్ల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. చక్కగా చదువు కొనసాగేలా అన్ని రంగాలలో...