విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ 320-డి ఆధ్వర్యంలో సోమవారం నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు పంపిణీ చేశారు. గతంలో హెచ్ ఎం గా విధులు నిర్వర్తించిన వనజ వీటిని అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ అధ్యక్షుడు రవీంద్రబాబు, పాఠశాల హెచ్ ఎం కోటేశ్వరరావు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.