నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాపూజీ వచనాలయ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చేర్మెన్ గడ్డం భక్తవత్సలం జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా భక్తవత్సలం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన జన్మదినం సందర్బంగా సేవ కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తన మిత్రులు, శ్రేయభిలాషుల తో కలసి ,పేద పిల్లల కు నోటు బుక్స్ పంపిణి చేశామని అన్నారు. హంగు అర్బాటాలు కాకుండ పేద విద్యార్థుల కోసం సేవా కార్యక్రమలు చేయడం ఆత్మ సంతృప్తి ఇస్తుంది అన్నారు. తన రాజకీయ జీవితం లో పేదలకు సేవ చేయాలనేదే మొదటి ప్రాధాన్యత అన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సహకారం అవసరం ఉన్న చేయడానికి సిదంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల తో కలసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమం లో బాపూజీ వచనాలయ సభ్యులు టి. శంకర్ అప్ప, కోవూరి జగన్, దిలీప్ పవర్, తదితరులు పాల్గొన్నారు.
