Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 3:28 pm Posted by : ramakrishna

న్యూట్రిన్ కిట్స్ పంపిణీ

నిజామాబాద్ సిటి, బతుకమ్మ: తలసేమియావ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మంగళవాం నగరంలోని  రెడ్ క్రాస్ లో  గల తలసేమియా వార్డులో న్యూట్రిన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆమె న్యూట్రిన్ కిట్లను పంపిణీ చేశారు. ఇందుకు సహకరించిన న్యూట్రిన్ కిట్స్ దాత జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్  జోన్ 12 అధికారి జిల్కర్ నయన్,  అన్నదాన దాత ఇందూర్ మదర్ హుడ్ ఆసుపత్రి  గైనకాలజిస్ట్ డా. కరిపే తేజస్వి, ఎం.డి. కరిపే అక్షయ్ ని అభినందించారు. అలాగే రెడ్ క్రాస్ చేపడుతున్న రక్త దాన శిబిరాలు, ఎన్నో సేవ కార్యక్రమాలను కొనియాడారు. యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చెయ్యాలని పిలుపునిచ్చారు. .ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ బుస్స ఆంజనేయులు,  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వరులు, తలసీమియా మెడికల్ ఆఫీసర్ డా అశ్విన్ కుమార్ రెడ్డి, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్  డా.రాజేష్, పి.ఆర్.ఓ బి.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Distribution of Neutrin kits