ఎంపీ లాడ్స్ ప్రొసీడింగ్స్ పంపిణీ ఇక అర్వింద్ చేతుల మీదే
కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో నిర్ణయం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ లాడ్స్ ( నిధుల) విషయంలో అరవింద్ ధర్మపురి నిర్ణయమే ఫైనల్ కానుంది. ఎందుకంటే ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పరిణామాలే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి 70 లక్షలు కేటాయిస్తూ వస్తున్నారు. కోవిడ్ కాలం మినహా మిగిలిన అన్ని సమయాల్లో ఐదు కోట్ల నిధులను ప్రతి నియోజకవర్గానికి చేరేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తూ...